రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టాలి… సీఎం జగన్‌

అక్టోబరు నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయని.. ఆ వెంటనే రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టాలని అధికారులను ఏపీ సీఎం జగన్‌ ఆదేశించారు. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నీ బాగు చేయాలన్నారు. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. వర్షాల వల్ల రహదారులు బాగా దెబ్బతిన్నాయన్నారు.

రోడ్లు బాగు చేసేందుకు ప్రభుత్వం నిధి ఏర్పాటు చేసిందని చెప్పారు. రోడ్ల మరమ్మతుల కోసం ఇప్పటికే చాలావరకు టెండర్లు పిలిచారని.. ఎక్కడైనా ఇంకా పిలవకపోతే వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. అక్టోబరులో రోడ్ల మరమ్మతులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా రోడ్ల పనులు చేయాలని పేర్కొన్నారు. సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలిసి కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.

Leave A Reply

Your email address will not be published.