లగ్జరీ కార్ల తయారీదారు లాంబోర్ఘినీ ఏపీలో అడుగుపెడుతోంది: విజయసాయిరెడ్డి

ఇటలీకి చెందిన విలాసవంతమైన స్పోర్ట్స్ కార్ల తయారీదారు లాంబోర్ఘినీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఏపీలో మరో మెగా పెట్టుబడి అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఏపీలో విద్యుత్ ఆధారిత వాహనాలు తయారుచేసేందుకు లాంబోర్ఘినీ ఆసక్తి చూపుతోందని, రూ.1,750 కోట్ల మేర పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉందని వివరించారు. భారత్ లో పెట్టుబడులకు అత్యంత అనువైన రాష్ట్రంగా ఏపీ పేరు తెచ్చుకుంటోందని, సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు పోతోందని కొనియాడారు.

లాంబోర్ఘినీ ఓ ప్రపంచస్థాయి కార్ల తయారీ దిగ్గజం. ఈ సంస్థ తయారుచేసిన పలు మోడళ్లు రూ.3 కోట్ల పైచిలుకు ధర పలుకుతున్నాయి. భారత్ లోనూ అనేకమంది సినీ స్టార్లు లాంబోర్ఘినీ కారు కొనడాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారంటే అతిశయోక్తి కాదు.

జగన్ పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలుకు అనుమతి ఇవ్వండి: లాయర్ అశ్విని ఉపాధ్యాయ

సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సీజేఐకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లం మీడియా ముఖంగా వెల్లడించిన తర్వాత కలకలం రేగింది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ జగన్ పై సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కు సుప్రీంకోర్టు లాయర్ అశ్విని ఉపాధ్యాయ లేఖ రాశారు.

సీజేఐకి జగన్ రాసిన లేఖను బయట పెట్టడం ముమ్మాటికీ కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని లేఖలో ఆయన పేర్కొన్నారు. 31 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి కోర్టులను, జడ్జిలను బెదిరించేలా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. జగన్ పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. మరోవైపు జగన్ ను సీఎం పదవి నుంచి తొలగించాలని సీజేఐకి కూడా లేఖ రాశారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని గతంలో ఆయన పిటిషన్ వేశారు.
Tags: Justice Ramana, Supreme Court, ashwini upadhyay, ys jaganmohan reddy vs judicial, court petition to be filed against Jagan

డ్రగ్స్ కొంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన నటి ప్రీతికా చౌహాన్

డ్రగ్స్ కొంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన నటి ప్రీతికా చౌహాన్

డ్రగ్స్ భూతం బాలీవుడ్ ను వణికిస్తోంది. ఇప్పటికే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా బుల్లితెర నటి ప్రీతికా చౌహాన్ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ ఎన్సీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. కిల్లా కోర్టులో ఆమెను ప్రవేశపెట్టనున్నట్టు పోలీసులు తెలిపారు. ‘దేవో కె దేవ్ మహాదేవ్’, ‘సంవాదన్ ఇండియా’ వంటి సీరియల్స్ లో నటించిన ప్రీతికా మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ప్రీతికాను విచారిస్తే మరిన్ని పేర్లు వెలుగులోకి వస్తాయని ఎన్సీబీ అధికారులు భావిస్తున్నారు.
Tags: Preetika Chauhan, Bollywood Drugs, Actress Preetika Chauhan, Chauhan found red handed

ట్రంప్ కు అమెరికన్లపై ప్రేమ, అభిమానం లేదు: ఒబామా తీవ్ర విమర్శలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఒక స్వార్థపరుడని … తన వ్యక్తిగత స్వార్థం కోసమే మరోసారి అధ్యక్షుడు కావాలనుకుంటున్నారని విమర్శించారు. అమెరికన్లపై ఆయనకు ఎలాంటి ప్రేమ, అభిమానం లేదని అన్నారు. కేవలం తన వ్యక్తిగత లాభం, తన సంపన్న మిత్రుల కోసం మరోసారి ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నారని అన్నారు. డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ కు మద్దతుగా ప్రచారం చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ చుట్టూ ఉండే వ్యక్తులంతా లాబీయింగ్ చేసేవారని ఒబామా ఆరోపించారు. సామాన్యులెవరూ ట్రంప్ దరిదాపుల్లో కూడా ఉండరని అన్నారు. కరోనాను కట్టడి చేయడంలో కూడా ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. కఠిన సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం ట్రంప్ కు లేదని అన్నారు. డెమోక్రాట్ అభ్యర్థులు బైడెన్, కమలా హారిస్ మాత్రం అందరి కోసం పని చేస్తారని చెప్పారు.
Tags: Donald Trump, USA Obama, president elections

mekapati goutham reddy

స్థానిక ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేం: ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీలతో సమావేశాన్ని నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ప్రకటించడంతో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో మంత్రి గౌతమ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా ప్రభావం కొంచెం తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ, మళ్లీ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారని, ఈ నేపథ్యంలో నవంబర్ లో ఎన్నికలను నిర్వహించే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. వచ్చే నెలలో కేసులు పెరిగే అవకాశం ఉండొచ్చని గౌతమ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో జరుగుతున్నవి అసెంబ్లీ ఎన్నికలని, అందువల్ల వాటి నిర్వహణ తప్పనిసరి అని చెప్పారు. మన దగ్గర జరుగుతున్నవి స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో కొంత వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని తెలిపారు.

Tags: Mekapati Goutham Reddy, Local Body Polls, YSRCP

Pramod Mittal

ఒకప్పుడు రూ.500 కోట్లు ఖర్చుపెట్టి కూతురు పెళ్లి చేశాడు.. ఇప్పుడు దివాళా తీశాడు!

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. శ్రీమంతులు బజారున పడొచ్చు… సామాన్యుడు అందలానికి ఎక్కొచ్చు. ఇలాంటి మరో ఘటనే ఇప్పుడు చోటుకుంది. ప్రపంచంలోని శ్రీమంతుల్లో ఒక్కరైన లక్ష్మీ మిట్టల్ సోదరురు ప్రమోద్ మిట్టల్ దివాళా తీశాడు. లండన్ కు చెందిన ఈ వ్యాపారవేత్త వేలాది కోట్ల అప్పుల్లో కూరుకుపోయారు. దాదాపు రూ. 24 వేల కోట్ల అప్పులు ఆయనకు ఉన్నట్టు తేలింది.

ప్రమోద్ మిట్టల్ 2013లో తన కూతురు వివాహాన్ని జరిపించాడు. ఆ వివాహాన్ని చూసి జనాలంతా ఆశ్చర్యపోయారు. దాదాపు రూ. 500 కోట్లను పెళ్లి కోసం ఆయన ఖర్చు చేశారు. అలాంటి ప్రమోద్ మిట్టల్ ఇప్పుడు దివాళా తీశారు. 2006లో బోస్నియన్ కోక్ తయారీ కంపెనీ జీఐకేఐఎల్ రుణాలకు తన గ్లోబల్ స్టీల్ హోల్డింగ్ తరపున ఆయన హామీ సంతకం పెట్టారు. అయితే జీఐకేఐఎల్ సంస్థ రుణాలను చెల్లించలేకపోయింది. దీంతో, అప్పులు ఇచ్చిన మార్గెట్ కంపెనీ 166 మిలియన్ డాలర్లను చెల్లించాలంటూ మిట్టల్ ను కోర్టుకు లాగింది. ఇంత మొత్తాన్ని చెల్లించలేకపోవడంతో ఆయన దివాళా తీశారు.
Tags: Pramod Mittal, Bankrupt, Lakshmi Mittal, London

TDP National General Secretary Nara Lokesh

నేడు అనంతపురంలో లోకేష్ పర్యటన

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ఉదయం 10 గంటలకు గుత్తి సమీపంలోని జిల్లా సరిహద్దుకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. లోకేష్ గుంతకల్లు నియోజకవర్గంలోని ధర్మపురం, మామిడి మండలంలోని పొగరూరు, పెద్దవడుగూరు మండలం మిడుతూరు, గార్లెదిన్నె మండలం రామదాసుపేట, రాప్తాడు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించనున్నారు. బాధిత రైతులతో ఆయన మాట్లాడనున్నారు.

వారిలో భరోసా నింపడంతో పాటు క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కుంటున్న పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. లోకేష్ పర్యటన నాలుగు నియోజకవర్గాల్లో సాగనుంది. ఆ మేరకు ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

‘ఆర్ఆర్ఆర్’ నుంచి కొమురం భీమ్ టీజర్ విడుదల పులిలా దూసుకెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్

‘బాహుబలి’ సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్ ను ఆ సినిమా యూనిట్ ఈ రోజు విడుదల చేసింది.  దీని కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న విషయం తెలిసిందే. 11 గంటలకు ఈ టీజర్ ను విడుదల చేస్తామని చెప్పినప్పటికీ, అరగంట ఆలస్యంగా దీన్ని విడుదల చేశారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి  ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్‌ను ఈ సినిమా యూనిట్ ఇంతకుముందే ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ రోజు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ ను పరిచయం చేసింది.

‘వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి’.. అంటూ చెర్రీ వాయిస్ తో ఉన్న ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ భీమ్ టీజర్ అదుర్స్ అనిపిస్తోంది. ‘నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీం’ అంటూ చరణ్ ఈ పాత్రను పరిచయం చేశాడు. పులిలా పోరాటానికి ఎన్టీఆర్ టీజర్ లో దూసుకెళ్తున్నాడు.

 

జర్నలిస్టులకు అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలి: మచ్చా రామలింగారెడ్డి

  • ప్రింట్ చేయని పత్రికల ద్వారా సమాచార శాఖలో కోట్లు దండుకున్న అడ్వటైజ్మెంట్ (Advertisement)లపై ACB, CID ఎంక్వైరీ చేయాలి
  • జర్నలిస్టుల సమస్యలపై సీఎం జగన్ చొరవ చూపాలి మచ్చా రామలింగారెడ్డి
  • రాష్ట్ర అధ్యక్షులు 
  • ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ (A.P.J.D.S) డిమాండ్.

రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని సంస్కృతిని కొందరు అధికారులు అమలు చేస్తున్నారు. జర్నలిస్టుల అక్రిడేషన్ లు రెన్యువల్ చేయకుండా కొత్తవి ఇవ్వకపోవడంతో క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

– జర్నలిస్టులకు అక్రిడేషన్ లు డిసెంబర్ వరకు రెన్యువల్ చేయాలి లేదా కొత్త అక్రిడేషన్ లు వెంటనే ఇవ్వాలి.

👉ఈరోజు అనంతపురం నగరంలోని రోడ్డు భవనాల అతిథిగృహంలో మచ్చా రామలింగారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

👉సమాచార శాఖ 48 గంటల్లోపు అక్రిడేషన్ సమస్యని పరిష్కరించాలని.
-కొత్త కార్డులు ఇవ్వడానికి వీలుకాకపోతే పాత కార్డులను రెన్యూవల్ చేయాలి.
-అక్రిడేషన్ల కోసం జర్నలిస్టులు రోడ్డెక్కే పరిస్థితి రాకుండా సమాచార శాఖ కమిషనర్ వెంటనే స్పందించాలి.

👉గత ప్రభుత్వంలో మార్కెట్లోకి రాని ఏపీ, తెలంగాణ పత్రికలకు కోట్ల రూపాయలు యాడ్స్ రూపంలో కట్టబెట్టారు. పెద్ద ఎత్తున జరిగిన దుర్వినియోగం పై ACB, CID చే విచారణ చేయించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి.

👉జర్నలిస్టుల సంక్షేమం కోసమే పుట్టామని చెప్పుకుంటున్న జర్నలిస్ట్ సంఘాలు అక్రిడేషన్లపై నోరెందుకు మెదపడం లేదని నిలదీశారు.
-ఇదేనా జర్నలిస్టుల సంక్షేమం అంటే.. జర్నలిస్టులు ఇబ్బంది పడుతుంటే తమ యూనియన్లకు కమిటీలో ప్రాధాన్యత కావాలని పోరాటం చేయడం అన్యాయం.

👉రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టు సోదరులందరూ ఆలోచించాలని స్వప్రయోజనాల కోసం యూనియన్ల ముసుగు వేసుకున్న వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు.

👉రాష్ట్రంలోని అన్ని జర్నలిస్టు యూనియన్లకు గుర్తింపునివ్వాలని అన్ని కమిటీలో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.

👉యూనియన్లు ఇచ్చిన సభ్యత్వ మీద లేబర్ కమిషనర్ సమాచార శాఖ కమిషనర్లు ఎంక్వయిరీ చేయాలని అందులో నిజమేనా సభ్యత్వం ఏదో గుర్తించాలని మచ్చా డిమాండ్ చేశారు.. జర్నలిస్టుల మధ్య చిచ్చు పెట్టకుండా చూడాలని కోరారు.

👉రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై ఐక్య ఉద్యమాలు చేయాలని JAC ఏర్పాటు చేస్తామని, అన్ని సంఘాలు కలిసి పోరాటం చేసి జర్నలిస్టుల అక్రిడేషన్లు, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, చిన్న పత్రికల అడ్వర్టైజ్మెంట్లు పై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని మచ్చా అన్నారు..

👉సమాచార శాఖ అన్ని పత్రికలకు అడ్వర్టైజ్మెంట్ సమానంగా ఇవ్వాలని చిన్న పత్రికలకు బడ్జెట్లో 30 శాతం కేటాయించాలని అవి కూడా రాష్ట్రంలో వచ్చే చిన్న పత్రికలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

👉గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జర్నలిస్టుల సమస్యలపై దృష్టిపెట్టి జర్నలిస్టులను ఆదుకోవాలని జర్నలిస్టులకు అండగా ఉండాలని మచ్చా రామలింగారెడ్డి విజ్ఞప్తి చేశారు.

👉రాష్ట్రంలోని జర్నలిస్టులు రోడ్డు ఎక్కకుండా చూడాల్సిన బాధ్యత, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాల్సిన బాధ్యత సమాచార శాఖ అధికారులదే అని మచ్చా రామలింగారెడ్డి అన్నారు.

👉విలేకర్ల సమావేశంలో దామోదర్ రెడ్డి, విజయరాజు శ్రావణ్, షాకిర్, పవన్, నాయక్, చలపతి, జానీ తదితరులు పాల్గొన్నారు.

💎ANDHRA PRADESH JOURNALIST DEVELOPMENT SOCIETY, (A.P.J.D.S.) 💎