లాస్ వెగాస్ నరమేధం సమయంలో వీరే హీరోలు!

క్షతగాత్రులను కాపాడేందుకు ముందుకు కదిలిన సాటి మనుషులు
నరమేధం ఆగిన తరువాత పరిమళించిన మానవత్వం
అంబులెన్సుల్లో ఎక్కించేందుకు, ఆసుపత్రులకు తరలించేందుకు తాపత్రయం
లాస్‌ వెగస్‌ స్ట్రిప్ లో మాండలే బే రిసార్ట్ లో చోటుచేసుకున్న నరమేధం సమయంలో జనం ప్రాణాలు కాపాడుకునేందుకు తలోదిక్కుకు పరుగులు తీస్తే… కొంత మంది మాత్రం అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. వచ్చే చావును ఎవరూ ఆపలేరని భావించి, కొంత మందినైనా కాపాడుకుందామని దైర్యంగా ముందడుగు వేశారు. వారిలో మాజీ సైనికుడు రాబ్‌ లెడ్‌ బెటర్‌ (42) ఒకరు.

ఇరాక్‌ లో అమెరికా సైన్యానికి ‘స్నైపర్‌’ గా పని చేసిన రాబ్ లెడ్ బెటర్.. కాల్పుల శబ్దం వినగానే అప్రమత్తమయ్యాడు. ఇంతలో బులెట్‌ గాయమైన సోదరుడితో పాటు తన భార్య, స్నేహితులు, బంధువులను వేగంగా వీఐపీ ఏరియాలోకి తరలించాడు. మళ్లీ బయటకు వెళ్లి అనేక మంది క్షతగాత్రులకు సాయపడ్డాడు.

యుద్ధభూమిలో రక్తస్రావం జరిగితే ఏం చేస్తారో అక్కడ ఆయన అదే చేశారు. బుల్లెట్ గాయాలతో షాక్ కు గురై తీవ్రంగా గాయపడ్డవారికి ధైర్యం చెబుతూ, రక్తస్రావం జరగకుండా ఉండేలా వారి దుస్తులతో కట్లు కట్టాడు. బుల్లెట్ గాయాలైన పదిమందిని ట్రక్ లో తీసుకుని ఆసుపత్రికి వెళ్లాడు. జాచ్ అనే మరో వ్యక్తి, మరుగుదొడ్ల కోసం ఏర్పాటు చేసిన ట్రాలీలో 9 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకుని వెళ్లి రక్షించాడు.

టెన్నీసీలోని ఒక ఆసుపత్రిలో కాంపౌండర్‌ గా పని చేస్తున్న సోనీ మెల్టన్‌ తన భార్య హీథర్‌ కు బుల్లెట్లు తగలకుండా రక్షణ గా నిలిచి ప్రాణత్యాగం చేశాడు. ఘటన జరిగిన తరువాత అక్కడ మానవత్వం పరిమళించింది. ఎంతో మంది తమ స్నేహితులు, బంధువులు, అపరిచితులను అంబులెన్సుల్లో ఎక్కిస్తూ, తీవ్రంగా గాయపడి ప్రాణాపాయంలో ఉన్నవారికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ కనిపిించారు. వారంతా అక్కడ హీరోలుగా నిలిచారు.

హిందువు కావడం వల్లే గుర్మీత్‌కు ఈ గతి..

మేమంతా ఇస్లాంలోకి మారిపోతున్నాం: సందీప్ మిశ్రా సంచలన ప్రకటన
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌తో టచ్‌లో ఉన్నాం
ముస్లింలను ముట్టుకునే ధైర్యం ఈ దేశంలో ఎవరికైనా ఉందా?
ఇస్లాంలో చేరికకు లక్షమంది సిద్ధం
డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ హిందువు కావడం వల్లే ఆయనకీ దుర్గతి పట్టిందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా ఇస్లాంలో చేరుతామంటూ సంచలన ప్రకటన చేశారు. సాధ్వీలపై అత్యాచారం కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. హిందూ సంస్థలు చాలా సులభంగా టార్గెట్ అవుతున్నాయని, గుర్మీత్ హిందువు కావడం వల్లే ఆయన జైలుకు వెళ్లారని డేరా అనుచరులు ఆరోపించారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో డేరా అధికార ప్రతినిధి సందీప్ మిశ్రా ముఖానికి మాస్క్ ధరించి మాట్లాడుతున్న వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. సిర్సాలో ఈ వీడియోను చిత్రీకరించారు. అందులో ఆయన మాట్లాడుతూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీతో డేరా అనుచరులు ‘టచ్’లో ఉన్నట్టు చెప్పారు.

‘‘మీరు హిందూస్థాన్‌ను అభిమానిస్తే మీ కంటి నుంచి నీరు తప్ప మరేమీ రాదు. మన సొంత దేశంలో హిందువుగా ఉండడం నేరం. విశ్వాసంపై దాడి జరిగినప్పుడు మతం ఎందుకు మారకూడదు? నా ఆలోచనలకు దగ్గరగా ఉండే వారితో నేను కలుస్తా’’ అని సందీప్ మిశ్రా ఆ వీడియోలో పేర్కొన్నారు.

ఆ వెంటనే ముసుగు ధరించి ఆయన వెనకవైపు ఉన్న మరో వ్యక్తి మాట్లాడుతూ.. ఇస్లాంలో చేరడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ముస్లింలను తాకే సాహసం కూడా ఎవరూ చేయబోరని అన్నాడు. వారు రాళ్లు విసిరినా వారిని ఏమైనా అనే ధైర్యం ఎవరికీ ఉండదన్నాడు. తమ నాయకులు ముస్లిం లీడర్లతో మాట్లాడుతున్నారని, ఇస్లాం పుచ్చుకునేందుకు లక్షమంది తమ సంసిద్ధతను వ్యక్తం చేశారని పేర్కొన్నాడు. ఇస్లాం పుచ్చుకున్నాక కూడా తాము భారత్‌లోనే ఉంటామని ఆయన తేల్చి చెప్పాడు.

అయితే మిశ్రాకు ఇటువంటి ఆలోచన లేదని, దీని వెనక కూడా డేరా బాబానే ఉండి ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుర్మీత్‌కు మతం కార్డు ఎలా వాడుకోవాలో తెలుసని అంటున్నారు. గుర్మీత్ తెలివైన నక్కలాంటి వాడని, తన అనుచరుల్లో కొందరి పేర్లను ముస్లింల పేర్లుగా మార్చి, ముస్లింలు కూడా తన అనుచరులుగా ఉన్నారని ఆయన చెప్పుకున్నాడని చెబుతున్నారు.

 

కిమ్ జాంగ్ ఉన్ ను హతమార్చేందుకు అమెరికా ప్రణాళిక?

యుద్ధం కంటే కిమ్ ను చంపడమే మేలంటున్న అమెరికా
కిమ్ వ్యతిరేకుల సాయంతో అమెరికా బలగాల ఆపరేషన్
అణుయుద్ధం ఆపాలంటే కిమ్ ను హతమార్చడం కంటే మరో మార్గం లేదంటున్న అమెరికా
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ హత్యకు అమెరికా వ్యూహాలు రచిస్తోందా?…అణ్వాయుధ పరీక్షలు, మూడో ప్రపంచయుద్ధం ఆపాలంటే కిమ్ జాంగ్ ఉన్ ను చంపడమే మార్గమని అగ్రారాజ్యం భావిస్తోందా? అంటే డెయిలీ స్టార్ పత్రిక వెల్లడించిన వివరాలు అవుననే సమాధానమిస్తున్నాయి. అమెరికాతో చర్చలకు కిమ్ విముఖంగా ఉండడానికి తోడు, యుద్ధానికే మొగ్గుచూపుతో సైనిక బలగాన్ని పెంచుకుంటున్న నేపథ్యంలో ఉపేక్షించేందుకు సమయం కాదని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో అతనిని హతమార్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు అతనిని హతమార్చేందుకు అమెరికా రహస్య సాయుధ సేవల బలగాలు, యూఎస్‌ డెల్టా ఫోర్స్‌, దక్షిణ కొరియా కమాండో ఒక యూనిట్‌ గా ఏర్పడనుందని తెలుస్తోంది.

కిమ్ తరవాతి టార్గెట్ దక్షిణ కొరియా అని తెలుస్తోంది. దక్షిణ కొరియా ఆర్థిక రాజధాని సియోల్‌ పై ఎలెక్ట్రోమేగ్నటిక్‌ పల్స్‌ (ఈఎంపీ) దాడిచేసి ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు కిమ్ వ్యూహాలు రచిస్తోందని, ఇది జరగకముందే అతనిని హతమార్చాలని భావిస్తోంది. గగన, ఉపరితల, జల మార్గాల ద్వారా ఏకకాలంలో కిమ్‌ ప్యాలెస్‌ పై దాడి చేసి అతనిని అంతమొందించాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నాయి. ఉత్తర కొరియాలోనే రక్షణ విధులు నిర్వహిస్తూ కిమ్‌ తీరు నచ్చని వారి సహాయంతో ఆపరేషన్ అమలు చేయాలని అమెరికా భావిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్, ఏ చిన్న పొరపాటు జరిగినా కిమ్‌ కుక్కలకు ఆహారం కావాల్సిందే. అంతే కాకుండా మూడో ప్రపంచ యుద్ధానికి కారణం కూడా అవుతుందని బ్రిటన్‌ ఇంటెలిజెన్స్‌ సీనియర్‌ అధికారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, అణుయుద్ధంకంటే ఇది మంచి ప్రత్యామ్నాయం అని ఆయన దీనిని సమర్థించడం విశేషం.

దీని ద్వారా సంభవించే పరిణామాలు ఇంగ్లండ్ పై కూడా తీవ్రప్రభావం చూపుతాయని నిపుణులు భావిస్తున్నారు. అంతే కాకుండా కిమ్ ను హతమారిస్తే, అంతర్జాతీయ న్యాయస్థానంలో చిక్కులు వచ్చిపడతాయని కూడా వారు హెచ్చరిస్తున్నారు. దీంతో అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు కిమ్ ను మార్చి, మరొక వ్యక్తిని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టాలంటూ చేసిన ఒత్తిడిని చైనా తొసిపుచ్చిందని, దీంతో తమ ముందు మరో మార్గం లేదని అమెరికా భద్రతాబలగాలు పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యూహం విజయవంతమయ్యేందుకు కేవలం 40 శాతం విజయవంతమయ్యే అవకాశముందని, 60 శాతం విఫలమయ్యే అవకాశం ఉందని, రిస్క్ అనుకోకుండా ఆపరేషన్ విజయవంతం చేస్తే, అణుయుద్ధం కంటే ఇదే మంచిదని పలువురు పేర్కొంటున్నారు.

తమిళనాట అస్థిర పరిస్థితులపై కేంద్రం దృష్టి..

అసెంబ్లీ సుప్త చేతనావస్థకు నిర్ణయం!

మిళనాడులోని అధికార అన్నాడీఎంకే, టీటీవీ దినకరన్ వర్గాల మధ్య వర్గ పోరు మరింత ముదరడంతో కేంద్రం రంగంలోకి దిగింది. తమిళనాట అస్థిర పరిస్థితులు ఏర్పడడంతో అసెంబ్లీని కొన్నాళ్లు సుప్త చేతనావస్థలో ఉంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 135 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో 22 మంది దినకరన్ వర్గంలో చేరడంతో సంక్షోభం మరింత ముదిరింది. పళని సర్కారు బలం 113కు తగ్గి మైనారిటీలో పడింది. ప్రభుత్వం నిలబడాలంటే పళని వర్గానికి ఇంకా ఐదుగురు శాసనసభ్యులు అవసరం.

మరోవైపు ఇటీవల ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిర్వహించిన కీలక సమావేశానికి 28 మంది శాసన సభ్యులు డుమ్మా కొట్టారు. వీరంతా దినకరన్ మద్దతుదారులై ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో కంగారు పడిన పళనిస్వామి వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలపై దృష్టి సారించిన కేంద్రం అస్థిర పరిస్థితులను కొనసాగించడం కంటే శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచడమే మేలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని వారాలు, లేదంటే 2019 సాధారణ ఎన్నికల వరకు అలాగే కొనసాగించాలని భావిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం.

2019 కల్లా స్విస్ నల్లకుబేరుల జాబితా ఇస్తాం: స్విస్ అధ్యక్షురాలి హామీ

 

నల్లకుబేరుల వివరాల తొలి జాబితాను 2019 కల్లా అందజేస్తామని స్విట్జర్లాండ్‌ అధ్యక్షురాలు డోరిస్‌ ల్యూథర్డ్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆమె ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిపిన విస్తృత చర్చల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలతో పాటు ద్వైపాక్షిక సంబంధాలు, పన్ను ఎగవేత, నల్లధనాన్ని వెలికితీసేందుకు సహకారంపై అవగాహనకు వచ్చారు. ఈ సందర్భంగా అణు ఇంధన సరఫరా దేశాల గ్రూప్‌ (ఎన్‌ఎస్‌జీ) లో, క్షిపణి సాంకేతిక పరిజ్ఞానం నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్‌) లో సభ్యత్వానికి మద్దతు తెలపడంపై ఆమెకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. పన్ను ఎగవేత సమాచార ఆటోమేటిక్ మార్పిడి చట్టాన్ని ఈ ఏడాది చివరికంతా పార్లమెంటు ఆమోదిస్తుందని ఆమెకు హామీ ఇచ్చారు. రైల్వే రంగంలో సహకారానికి రెండు ఒప్పందాలు కుదుర్చుకున్నామని మీడియా సమావేశంలో తెలిపారు.

నా మనవడు నా పేరే మర్చిపోయాడు: నటుడు బాలకృష్ణ

తన మనవడు చిన్నారి దేవాన్ష్ తన పేరే మర్చిపోయాడని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘మనవడు దేవాన్ష్ ను ‘నా పేరేంటిరా? అని అడిగితే..‘శాతకర్ణి’ అని, లేకపోతే ‘గోల తాత’ అంటాడు’ అని చెబుతూ బాలయ్య నవ్వులు చిందించారు.

బాలయ్య తన అభిమానిపై చేయిచేసుకున్న సందర్భాన్ని ప్రస్తావించగా, ‘నా చేయి తగలడం అభిమానులు ప్రేమగా భావిస్తారు. అతిగా చేస్తే తప్పా, నేను చేయి చేసుకోను. నా అభిమానులకు నాకు మధ్య ఎవరైనా వస్తే దబిడిదిబిడే’ అని చెప్పుకొచ్చారు. కాగా, దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘పైసా వసూల్’ చిత్రం రేపు విడుదల కానుంది.

 

ప్రతిపక్ష వైసీపీ నుంచి మళ్లీ జంపింగ్‌లు..

టీడీపీలోకి పలువురు ఎమ్మెల్యేలు?

నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి ప్రభావం వైసీపీ నేతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తమ భవిష్యత్తుపై ఆందోళన రేకిత్తిస్తోంది. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండడంతో ఇప్పుడే మేలుకుంటే మంచిదనే భావన వారిలో కనిపిస్తోంది. అందులో భాగంగా పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా తమ అధినేత నంద్యాలలో ఏకంగా 13 రోజులు మకాం వేసి ప్రచారం చేసినా ఓటర్లు విశ్వసించకపోవడాన్ని చూసి వారిలో దిగులు మొదలైంది. కళ్ల ముందు భవిష్యత్తు కనిపిస్తుండడంతో టీడీపీ తప్ప మరోమార్గం లేదని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

బుధవారం సచివాలయంలో ఇధ్దరు మంత్రులకు రాయలసీమకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు రావడం ఇందుకు నిదర్శనంగా భావిస్తున్నారు. వారిద్దరూ టీడీపీలో చేరికపై ఆసక్తి కనబరిచనట్టు మంత్రులు చూచాయగా చెప్పారు. అయితే అంతకుముందు చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంటుందని చెప్పడం చూస్తుంటే రాక ఖాయమనన్న విషయం స్పష్టమవుతోంది. అయితే వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకునే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోమని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ ప్రచారం చేసినంతగా ప్రజల్లో టీడీపీపైనా, ప్రభుత్వంపైనా వ్యతిరేకత లేదన్న విషయం స్పష్టమైందని స్వయంగా వైసీపీ నేతలే చెబుతుండడం ఇందుకు మరో ఉదాహరణగా చెబుతున్నారు. మరోవైపు నంద్యాలలో గెలిచి ఉంటే బీజేపీ తమతో జత కడుతుందని వైసీపీ చీఫ్ భావించారని, ఇప్పుడా పరిస్థితి లేదని చెబుతున్నారు. కాగా, పార్టీ మారే అవకాశం ఉందని భావిస్తున్న ఎమ్మెల్యేలపై వైసీపీ అధిష్టానం ఓ కన్నేసి ఉంచినట్టు సమాచారం.

 

99 శాతం 1000 నోట్లు వచ్చేశాయి: ఆర్బీఐ ప్రకటన

గత నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మూడు నెలలపాటు పాత నోట్లను తిరిగి ఆర్బీఐకి ఇచ్చేసేందుకు గడువును విధించింది. దీంతో పాత నోట్లు వెల్లువలా బ్యాంకులను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లకు ఆర్బీఐ రద్దు చేసిన పాత నోట్లపై తొలిసారి వార్షిక నివేదికలో పేర్కొంది. అందులో రద్దయిన కరెన్సీ మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేసినట్టేనని తెలిపింది. ప్రధానంగా రద్దయిన 1,000 రూపాయల నోట్లలో సుమారు 99 శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు వచ్చాయని చెప్పింది. 15.44 లక్షల కోట్ల విలువైన 1,000, 500 రూపాయల నోట్లు రద్దు కాగా, 15.28 లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు వచ్చాయని పేర్కొన్నారు. ఇంకా రావాల్సినవి 8,900 కోట్ల రూపాయల విలువైన 1000 నోట్లు మాత్రమే ఇంకా బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాల్సిఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది.

2008 నుంచి ఇప్పటి వరకు 72 మంది ఇండియన్ మిలియనీర్లు బ్రిటన్ చెక్కేశారు.. వెల్లడించిన యూకే

గత తొమ్మిది సంవత్సరాల్లో భారత్ నుంచి 72 మంది మిలియనీర్లు, 84 మంది డిపెండెంట్లు యూకేకు వలస వచ్చినట్టు బ్రిటన్ హోమ్ వ్యవహారాల కార్యాలయ గణాంకాలు చెబుతున్నాయి. విదేశీ పెట్టుబడిదారుల కోసం మంజూరు చేసే టైర్-1 (ఇన్వెస్టర్) వీసా ద్వారా 2 మిలియన్లు, అంతకంటే ఎక్కువ పౌండ్లు పెట్టుబడిగా పెడతామని హామీ ఇస్తూ వీరంతా బ్రిటన్ చేరుకున్నారు. కాగా, 2013లో 16 మంది భారత మిలియనీర్లు బ్రిటన్‌కు వెళ్లిపోగా ఇప్పుడు ఏకంగా 72 మంది బ్రిటన్ చెక్కేశారు. భారతీయుల తర్వాత చైనా, రష్యా, అమెరికాకు చెందిన మిలియనీర్లు టైర్-1 వీసాను ఎక్కువగా తీసుకున్నారు. వీసా పొందిన వారి జాతీయ తప్ప ఇతర వివరాలు వెల్లడించేందుకు బ్రిటన్ నిరాకరించింది.

సినీ కుటుంబాల్లో మనశ్శాంతి ఉండదు…

 

సినీ పరిశ్రమకు చెందిన కుటుంబాల్లో మనశ్శాంఅందుకే డ్రగ్స్ తీసుకుంటారు: వర్ధమాన నటుడుతి ఉండదని అందుకే డ్రగ్స్ వంటి వాటిని ఆశ్రయిస్తారని నటుడు అభినయ్ దర్శన్ తెలిపాడు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో జరిగిన బెత్లెహామ్ ప్రార్థనా మందిరంలో జరిగిన ఉజ్జీవ సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అలా మనశ్వాంతి లేకపోవడంతో హిమాలయాలు వంటి ప్రాంతాలకు దానిని వెతుక్కుని వెళ్తుంటారని అన్నాడు. తాను సినీ హీరోగా ఉన్నప్పుడు మిస్స్డ్ కాల్స్, పోకిరి పోలీస్, బీటెక్ లవ్ వంటి సినిమాల్లో హీరోగా నటించానని ఆయన చెప్పాడు. ఆ సమయంలో మనశ్శాంతి కోసం డ్రగ్స్, మద్యం తీసుకునేవాడినని తెలిపాడు. అయితే క్రైస్తవం స్వీకరించిన తరువాత అలాంటి అలవాట్లు మానేశానని చెప్పాడు.