Harish Rao, New Revenue Act, Telangana, KCR Assembly

తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం దేశానికే దశ దిశ చూపనుంది: హరీశ్ రావు

రెవెన్యూ విధానంలో అనేక సంస్కరణలతో తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం అమలుకు తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సర్కారు వీఆర్వో వ్యవస్థను కూడా రద్దు చేసింది. ఈ చట్టం నేడు అసెంబ్లీ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్ రావు స్పందించారు.

తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం దేశానికే దశ దిశ చూపనుందని ఉద్ఘాటించారు. అవినీతి, ఆలస్యం వంటి బాధల నుండి పేదలు, రైతులకు విముక్తి కల్పించే చారిత్రక చట్టం అని అభివర్ణించారు. రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలు నవశకానికి నాంది పలకనున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు హరీశ్ రావు ట్వీట్ చేశారు.
Tags: Harish Rao, New Revenue Act, Telangana, KCR Assembly

కొడాలి నాని పితృభాష ఎక్కువగా వినియోగిస్తున్నారు: రఘురామకృష్ణరాజు

అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని, అక్కడి నుంచి తరలించాలంటూ ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పట్ల నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే రాజధాని మొత్తాన్ని విశాఖకు తరలించాలని భావిస్తున్నట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. పూర్తిగా రాజధాని తరలింపుపై గతంలోనే వార్తలు వచ్చినా, ఇవాళ కొడాలి నాని వ్యాఖ్యలతో మరింత బహిర్గతం అయిందని అన్నారు. కోర్టులో కేసులు వెనక్కి తీసుకోకుంటే ఈ చిన్న రాజధానిని కూడా తరలించేస్తామని కొడాలి నాని బెదిరిస్తున్నారని, మంత్రి పితృభాష ఎక్కువగా వాడుతున్నారని ఆరోపించారు. కోర్టులో ఉన్న ఓ అంశం గురించి మంత్రి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని హితవు పలికారు.

“నాని గారు ఏది మాట్లాడినా వారి భావవ్యక్తీకరణలో ఉన్న మాధుర్యం చాలామందికి నచ్చుతుందనుకుంటా. ఆఖరికి సీఎం గానీ, చంద్రబాబు గానీ మాట్లాడినా లక్ష వ్యూస్ వస్తే, నాని గారికి మాస్ లో ఉన్న పాప్యులారిటీ దృష్యా ఆయనకు మిలియన్ వ్యూస్ వస్తాయి. ఆయన మాట్లాడే పితృభాష నచ్చేవారు ఎక్కువమంది ఉంటారు కాబట్టి ఆయన వాక్కు ఎక్కువమందికి చేరుతుందని భావిస్తున్నా” అంటూ రఘురామకృష్ణరాజు చురకంటించారు.
Tags: Raghurama Krishnaraju, Kodali Nani Language, Amaravati, Vizag, AP Capital

Chandrababu, Jagan Mask, Corona Virus, Narendra Modi

ప్రధాని, పొరుగు రాష్ట్రాల సీఎంలే మాస్కులు ధరిస్తున్నారు… ఈ ముఖ్యమంత్రికి ఏమైంది?

ప్రధాని, పొరుగు రాష్ట్రాల సీఎంలే మాస్కులు ధరిస్తున్నారు… ఈ ముఖ్యమంత్రికి ఏమైంది?: చంద్రబాబు
టీడీపీ సీనియర్ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ముఖ్యమంత్రి మాస్కు ధరించకపోవడం క్షమించరాని నేరం అని అన్నారు. ప్రధాని, పొరుగు రాష్ట్రాల సీఎంలే మాస్కు ధరిస్తున్నారని, మన రాష్ట్రంలో సీఎం, మంత్రులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

సీఎం జగన్ అన్నీ అసత్యాలే చెబుతుంటారని అన్నారు. మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరితాడు బిగించడం హేయమని పేర్కొన్నారు. వైసీపీ దుర్మార్గాలను అడ్డుకుని రైతుల ప్రయోజనాలు కాపాడాలని పార్టీ నేతలకు ఉద్బోధించారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి రాష్టానికి చెడ్డపేరు తెచ్చారని, కియా మోటార్స్ రాష్ట్రానికి రావడం వైసీపీకి ఇష్టం లేదని తెలిపారు. వైసీపీ బెదిరింపుల కారణంగానే కియా 17 యూనిట్లు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని వెల్లడించారు.

జగన్ సీఎం అయ్యాక ఏపీలో ఎస్సీలపై దాడులు జరగని రోజంటూ లేదని అన్నారు. ప్రతి జిల్లాలో వైసీపీ బాధిత ఎస్సీ కుటుంబాలకు అండగా ఉండాలని సూచించారు. వైసీపీ వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగిపోవడం బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్కడికక్కడ మంత్రులను నిలదీస్తుండడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనాలని తెలిపారు.
Tags: Chandrababu, Jagan Mask, Corona Virus, Narendra Modi

Kanaka medala Ravindra Kumar, Chandrababu, Telugudesam, Kodali Nani, YSRCP, Amaravati

కొడాలి నానితో ఆ మాట చెప్పించడం వెనుక పెద్ద కుట్ర ఉంది: కనకమేడల

అమరావతిలో శాసన రాజధాని కూడా అవసరం లేదని మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ రాజ్యసభసభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ స్పందిస్తూ… కొడాలి నానితో ఆ మాట చెప్పించడం వెనుక పెద్ద కుట్ర దాగుందని ఆరోపించారు. రాజధాని అంశం కోర్టుల పరిధిలో ఉన్న సమయంలో… న్యాయస్థానాలను కించపరిచేలా ఒక మంత్రి మాట్లాడటమేమిటని ప్రశ్నించారు.

పేదలకు భూములు పంచే నెపంతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు యత్నిస్తోందని కనకమేడల మండిపడ్డారు. కోర్టులు తమ నిర్ణయాలను అడ్డుకుంటాయని ప్రభుత్వానికి ముందే తెలుసని… కావాలనే న్యాయస్థానాలను కూడా రాజకీయాల్లోకి లాగాలని చూస్తోందని అన్నారు. పేదలకు భూములు ఎందుకు పంచడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో కట్టించిన దాదాపు 6 లక్షల ఇళ్లను ఎందుకు పంచలేదని అడిగారు. పేదలకు సెంటు భూమి ఇస్తే సరిపోతుందని చెపుతున్న వైసీపీ పెద్దలు… పెద్దపెద్ద భవంతుల్లో ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. అంతర్వేది ఆలయరథం దగ్ధం ఘటనతో ప్రభుత్వం మతపరమైన క్రీడ ఆడాలని చూస్తోందని విమర్శించారు.
Tags: Kanaka medala Ravindra Kumar, Chandrababu, Telugudesam, Kodali Nani, YSRCP, Amaravati

Vijayashanti, Congress, Telangana, Rapes, KCR TRS

కేసీఆర్ దొర గారు ఈ విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలి: విజయశాంతి

  • తెలంగాణలో కామాంధులు రెచ్చిపోతున్నారు
  • ఎన్ కౌంటర్ జరిగినా.. పోలీసులంటే భయం లేకుండా ఉంది
  • మహిళలు తీవ్ర అభద్రతాభావంలోకి వెళ్లిపోతున్నారు

తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణమైన స్థితిలో ఉన్నాయని… ప్రజలు తీవ్ర అభద్రతాభావంలో ఉన్నారని సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. వరుస ట్వీట్లతో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. నిజామాబాద్ లో ఒక యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తనను కలచి వేసిందని ఆమె అన్నారు.

మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తామంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం చెపుతున్న మాటలు… నీటి మీద రాతలే అనే విషయం తేలిపోయిందని దుయ్యబట్టారు. ఎన్నో పోరాటాల తర్వాత సాధించిన మన తెలంగాణలో ఆడబిడ్డలపై ఇలాంటి ఘోరమైన ఘటనలు జరుగుతుండటం కలచి వేస్తోందని ఆమె అన్నారు. ఏడాది క్రితం జరిగిన దిశ ఘటనను మరువక ముందే… అలాంటి మరో ఘటన జరగడం దారుణమని  చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని అత్యున్నత అధికార యంత్రాంగం కొలువుండే కలెక్టరేట్ సమీపంలో ఈ ఘటన జరగడం ఆందోళనకరమని చెప్పారు.

మహిళల రక్షణ కోసం ఏమైనా చేస్తామని చెప్పే ప్రభుత్వ ప్రకటనలన్నీ బూటకమే అనే విషయం ఈ ఘటనతో అర్థమవుతోందని విజయశాంతి అన్నారు. దిశ ఘటనలో పోలీసుల తూటాలకు దుండగులు హతమైనప్పటికీ… పోలీసులంటే భయం లేని రీతిలో కొందరు రెచ్చిపోతున్నారని ఆమె చెప్పారు. కామాంధులు ఈ రీతిలో రెచ్చిపోతున్నారంటే… తెలంగాణలోని చట్టాల అమలు ప్రభావం ఎంత మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చని దుయ్యబట్టారు. మహిళలు తీవ్ర అభద్రతాభావంలోకి వెళ్లిపోతున్నారనే విషయాన్ని కేసీఆర్ దొర గారు ఇప్పటికైనా గ్రహించాలని అన్నారు.

YV Subba Reddy, Jagan Family Photo, YSRCP, Anniversary

జగన్ ఫ్యామిలీ ఫోటో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

ఏపీలో వైసీపీ ఘనవిజయం సాధించి నేటికి ఏడాది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. సీఎం జగన్ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. గత 12 నెలల కాలంలో నవరత్నాలే కాకుండా, చెప్పనివి కూడా చేసి ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ప్రజానాయకుడు మన వైఎస్ జగన్ అంటూ కొనియాడారు. జగన్ మున్ముందు మరెన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను అంటూ వ్యాఖ్యానించారు. ఈ శుభదినాన అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు.
Tags: YV Subba Reddy, Jagan Family Photo, YSRCP, Anniversary

Chandrababu, Telugudesam, Andhra Pradesh

ఈ వీడియో చూసి షాక్‌ అయ్యాను!: చంద్రబాబు ట్వీట్

విజయనగరంలో చారిత్రక కట్టడం మూడు లాంతర్ల స్తంభాన్ని మున్సిపల్ సిబ్బంది కూల్చివేయడాన్ని చూసి షాకయ్యానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. అశోక్ గజపతి రాజు కుటుంబం ఆ ప్రాంతానికి అందించిన సాయానికి సంబంధించి గుర్తులను ఉద్దేశపూర్వకంగా తుడిచేయడానికి జగన్‌ పాల్పడుతున్న చర్యల్లో ఇదొకటని చంద్రబాబు విమర్శించారు.

చరిత్రను కాలరాస్తూ ఇటువంటి నీచ రాజకీయాలకు ప్రాధాన్యతనివ్వకూడదని హితవు పలికారు. కాగా, రాజుల కాలం నాటి మూడు లాంతర్ల స్తంభాన్ని కూల్చివేసిన కట్టడం స్థలంలో కొత్త చిహ్నాన్ని నిర్మించేందుకు అధికారుల ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
Tags: Chandrababu, Telugudesam, Andhra Pradesh

Ganta Srinivasa Rao Electricity Bills Andhra Pradesh Jagan Lockdown Corona Virus

ఒక సగటు వినియోగదారుడిగా వాళ్ల బాధలు ఆలకించండి: గంటా

రాష్ట్రంలో లాక్ డౌన్ నేపథ్యంలో విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు స్పందించారు.

సీఎం జగన్ తీసుకువచ్చిన డైనమిక్ విధానం వల్ల విద్యుత్ బిల్లులు ఒక్కసారిగా పెరిగిపోయాయని, అసలే రెండు నెలలుగా ఉపాధి లేక, ఆదాయం రాక సగటు ఆంధ్రా పౌరుడు బిల్లు చెల్లించలేని పరిస్థితుల్లో విలవిల్లాడుతున్నాడని వివరించారు. సగటు వినియోగదారుడిగా ఒక్కసారి ప్రజల బాధను ఆలకించాలని విజ్ఞప్తి చేశారు.

మూడు నెలల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీన్ని కూడా విపత్తులో భాగంగానే పరిగణించాలని, విపత్తు నిర్వహణ నిధుల నుంచి ప్రజలను ఆదుకునే ఆలోచన చేయాలని గంటా ఏపీ ప్రభుత్వానికి సూచించారు.
Tags: Ganta Srinivasa Rao Electricity Bills Andhra Pradesh Jagan Lockdown Corona Virus

Etela Rajender CentreLetter Corona Virus Testings

కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలు సరికాదు: మంత్రి ఈటల

తెలంగాణలో కరోనా టెస్టులను తక్కువగా నిర్వహిస్తున్నారంటూ కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. జాతీయ సగటు కంటే టెస్టులు తక్కువగానే ఉన్నాయని వ్యాఖ్యానిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది. ఈ లేఖపై తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని ఈటల చెప్పారు. తమ పటిష్ట చర్యల వల్ల కేసులు కూడా తక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్ర పరిస్థితులకు తగ్గట్టు పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.

మరోవైపు, కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలోనే… కేంద్రం నుంచి విమర్శలు రావడం గమనార్హం.
Tags: Etela Rajender CentreLetter Corona Virus Testings

VH KCR, Pothireddypadu, GO203, Telangana, Andhra Pradesh

కేసీఆర్ పోతిరెడ్డిపాడును జగన్ కు అప్పగించేశారు: వీహెచ్ వ్యంగ్యం

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్రబిందువుగా నిలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు స్పందించారు. సీఎం కేసీఆర్ పోతిరెడ్డిపాడును ఏపీ సీఎం జగన్ కు అప్పగించేశారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలు అందని నేపథ్యంలో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఏదేనీ అంశంపై గట్టిగా ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని వీహెచ్ ఆరోపించారు.

అటు కరోనా అంశంపైనా ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు. కరోనా కట్టడిలో కేసీఆర్ ఒట్టిమాటలు చెబుతున్నారని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులు, దాతల విరాళాలకు లెక్కా పత్రం లేదంటూ ఆరోపణలు చేశారు. పేదలకు ఇచ్చిన 1500 రూపాయలను వైన్ షాపులు తెరవడం ద్వారా ప్రభుత్వమే లాక్కుందని మండిపడ్డారు.
Tags: VH KCR, Pothireddy Padu, GO203, Telangana, Andhra Pradesh