Harish Rao, New Revenue Act, Telangana, KCR Assembly

తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం దేశానికే దశ దిశ చూపనుంది: హరీశ్ రావు

రెవెన్యూ విధానంలో అనేక సంస్కరణలతో తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం అమలుకు తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సర్కారు వీఆర్వో వ్యవస్థను కూడా రద్దు చేసింది. ఈ చట్టం నేడు అసెంబ్లీ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్ రావు స్పందించారు.

తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం దేశానికే దశ దిశ చూపనుందని ఉద్ఘాటించారు. అవినీతి, ఆలస్యం వంటి బాధల నుండి పేదలు, రైతులకు విముక్తి కల్పించే చారిత్రక చట్టం అని అభివర్ణించారు. రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలు నవశకానికి నాంది పలకనున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు హరీశ్ రావు ట్వీట్ చేశారు.
Tags: Harish Rao, New Revenue Act, Telangana, KCR Assembly

మనదేశంలో కల్చర్, అగ్రికల్చర్ రెండూ ఒకటే: పవన్ కల్యాణ్

  • భారత సంస్కృతిలో వ్యవసాయ విధానాలు కూడా భాగమేనని వెల్లడి
  • పంటలు చేతికొచ్చే వేళ పండుగలు చేసుకుంటామని వివరణ
  • ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగిస్తున్నామన్న పవన్

భారతదేశ సంస్కృతిలో వ్యవసాయ విధానాలు కూడా ఓ భాగమేనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పంటలు చేతికొచ్చేవేళ పండుగలు చేసుకోవడం అందులో భాగమేనని తెలిపారు. మన కల్చర్, అగ్రికల్చర్ ఒకటేననే భావన పెంపొందించుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. తాము ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యాచరణ చేపట్టామని, రాజకీయాలకు అతీతంగా జనసేన పార్టీ ప్రకృతి వ్యవసాయ విధానం అమలుకు కృషి చేస్తుందని తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ సోషల్ మీడియాలో స్పందించింది. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, రైతు విజయరామ్ సూచనలను కూడా పొందుపరిచారు.
Tags: Pawan Kalyan, Culture, Agriculture India, Janasena

‘బొమ్మ బ్లాక్ బస్టర్’లో ‌పోతురాజు ల‌వర్ వాణిగా రష్మీ.. త‌ల‌పై కిరీటంతో ఫ‌స్ట్ లుక్!

టాలీవుడ్ న‌టులు నందు, రష్మీ గౌతమ్‌ జంటగా రాజ్‌ విరాఠ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆ సినిమా యూనిట్ ఇటీవ‌ల‌ విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఇందులో నందు పోతురాజుగా, దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు ఫ్యాన్‌గా కనపడతాడని ఆ సినిమా యూనిట్‌ ప్రకటించింది.

తాజాగా, పోతురాజు గాడి ల‌వర్ వాణి అంటూ ర‌ష్మీ గౌత‌మ్ లుక్ ను ఆ సినీ యూనిట్ విడుద‌ల చేసింది. త‌ల‌పై కిరీటం పెట్టుకుని చిరున‌వ్వులు చిందిస్తూ క‌న‌ప‌డుతున్న ర‌ష్మీ లుక్ అభిమానుల‌ను ఆక‌ర్షిస్తోంది. కాగా, విజయీభవ ఆర్ట్స్‌పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు, ఆనంద్ రెడ్డి, మనోహర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Tags: Rashmi Gautam, Tollywood, Viral Pics, bomma blackbuster movie poster

కొడాలి నాని పితృభాష ఎక్కువగా వినియోగిస్తున్నారు: రఘురామకృష్ణరాజు

అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని, అక్కడి నుంచి తరలించాలంటూ ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పట్ల నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే రాజధాని మొత్తాన్ని విశాఖకు తరలించాలని భావిస్తున్నట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. పూర్తిగా రాజధాని తరలింపుపై గతంలోనే వార్తలు వచ్చినా, ఇవాళ కొడాలి నాని వ్యాఖ్యలతో మరింత బహిర్గతం అయిందని అన్నారు. కోర్టులో కేసులు వెనక్కి తీసుకోకుంటే ఈ చిన్న రాజధానిని కూడా తరలించేస్తామని కొడాలి నాని బెదిరిస్తున్నారని, మంత్రి పితృభాష ఎక్కువగా వాడుతున్నారని ఆరోపించారు. కోర్టులో ఉన్న ఓ అంశం గురించి మంత్రి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని హితవు పలికారు.

“నాని గారు ఏది మాట్లాడినా వారి భావవ్యక్తీకరణలో ఉన్న మాధుర్యం చాలామందికి నచ్చుతుందనుకుంటా. ఆఖరికి సీఎం గానీ, చంద్రబాబు గానీ మాట్లాడినా లక్ష వ్యూస్ వస్తే, నాని గారికి మాస్ లో ఉన్న పాప్యులారిటీ దృష్యా ఆయనకు మిలియన్ వ్యూస్ వస్తాయి. ఆయన మాట్లాడే పితృభాష నచ్చేవారు ఎక్కువమంది ఉంటారు కాబట్టి ఆయన వాక్కు ఎక్కువమందికి చేరుతుందని భావిస్తున్నా” అంటూ రఘురామకృష్ణరాజు చురకంటించారు.
Tags: Raghurama Krishnaraju, Kodali Nani Language, Amaravati, Vizag, AP Capital

Chandrababu, Jagan Mask, Corona Virus, Narendra Modi

ప్రధాని, పొరుగు రాష్ట్రాల సీఎంలే మాస్కులు ధరిస్తున్నారు… ఈ ముఖ్యమంత్రికి ఏమైంది?

ప్రధాని, పొరుగు రాష్ట్రాల సీఎంలే మాస్కులు ధరిస్తున్నారు… ఈ ముఖ్యమంత్రికి ఏమైంది?: చంద్రబాబు
టీడీపీ సీనియర్ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ముఖ్యమంత్రి మాస్కు ధరించకపోవడం క్షమించరాని నేరం అని అన్నారు. ప్రధాని, పొరుగు రాష్ట్రాల సీఎంలే మాస్కు ధరిస్తున్నారని, మన రాష్ట్రంలో సీఎం, మంత్రులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

సీఎం జగన్ అన్నీ అసత్యాలే చెబుతుంటారని అన్నారు. మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరితాడు బిగించడం హేయమని పేర్కొన్నారు. వైసీపీ దుర్మార్గాలను అడ్డుకుని రైతుల ప్రయోజనాలు కాపాడాలని పార్టీ నేతలకు ఉద్బోధించారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి రాష్టానికి చెడ్డపేరు తెచ్చారని, కియా మోటార్స్ రాష్ట్రానికి రావడం వైసీపీకి ఇష్టం లేదని తెలిపారు. వైసీపీ బెదిరింపుల కారణంగానే కియా 17 యూనిట్లు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని వెల్లడించారు.

జగన్ సీఎం అయ్యాక ఏపీలో ఎస్సీలపై దాడులు జరగని రోజంటూ లేదని అన్నారు. ప్రతి జిల్లాలో వైసీపీ బాధిత ఎస్సీ కుటుంబాలకు అండగా ఉండాలని సూచించారు. వైసీపీ వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగిపోవడం బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్కడికక్కడ మంత్రులను నిలదీస్తుండడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనాలని తెలిపారు.
Tags: Chandrababu, Jagan Mask, Corona Virus, Narendra Modi

Kanaka medala Ravindra Kumar, Chandrababu, Telugudesam, Kodali Nani, YSRCP, Amaravati

కొడాలి నానితో ఆ మాట చెప్పించడం వెనుక పెద్ద కుట్ర ఉంది: కనకమేడల

అమరావతిలో శాసన రాజధాని కూడా అవసరం లేదని మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ రాజ్యసభసభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ స్పందిస్తూ… కొడాలి నానితో ఆ మాట చెప్పించడం వెనుక పెద్ద కుట్ర దాగుందని ఆరోపించారు. రాజధాని అంశం కోర్టుల పరిధిలో ఉన్న సమయంలో… న్యాయస్థానాలను కించపరిచేలా ఒక మంత్రి మాట్లాడటమేమిటని ప్రశ్నించారు.

పేదలకు భూములు పంచే నెపంతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు యత్నిస్తోందని కనకమేడల మండిపడ్డారు. కోర్టులు తమ నిర్ణయాలను అడ్డుకుంటాయని ప్రభుత్వానికి ముందే తెలుసని… కావాలనే న్యాయస్థానాలను కూడా రాజకీయాల్లోకి లాగాలని చూస్తోందని అన్నారు. పేదలకు భూములు ఎందుకు పంచడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో కట్టించిన దాదాపు 6 లక్షల ఇళ్లను ఎందుకు పంచలేదని అడిగారు. పేదలకు సెంటు భూమి ఇస్తే సరిపోతుందని చెపుతున్న వైసీపీ పెద్దలు… పెద్దపెద్ద భవంతుల్లో ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. అంతర్వేది ఆలయరథం దగ్ధం ఘటనతో ప్రభుత్వం మతపరమైన క్రీడ ఆడాలని చూస్తోందని విమర్శించారు.
Tags: Kanaka medala Ravindra Kumar, Chandrababu, Telugudesam, Kodali Nani, YSRCP, Amaravati

World Corona cases 1,56,41,083

ప్రపంచ కరోనా @ 1,56,41,083

ప్రంపచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. నేటికి ప్రపంచ మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,56,41,083 కి చేరింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి 6,35,631 మంది ప్రాణాలు కోల్పోయారు.

కరోనా బారిన పడి ఇప్పటివరకు 95,29,429 మంది కోలుకున్నారు. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు అగ్రరాజ్యం అమెరికాలో నమోదైనాయి. అమెరికాలో నేటికి మొత్తం 41,69,170 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇప్పటి వరకు 1,47,298 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్ ఉంది.

A war of words between RGV and Pawan fans

ఆర్జీవీ, పవన్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్దం

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ, పవన్ కల్యణ్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. రాంగోపాల్ వర్మ నూతన్ నాయుడులు పోటీపోటీగా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. నగరంలోని ఆర్జీవీ ఆఫీస్ పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై కేసు కూడా నమోదు చేశారు. కాగా రాత్రి ఆర్జీవీ ఆఫీస్ కేసు ఉపసంహరించుకుంది. ఉస్మానియా జేఏసీకి, పవన్ ఫ్యాన్స్ కి సంబంధం ఏంటని ఆర్జీవీ ప్రశ్నించారు.

KTR should still serve in the future Chiranjeevi

కేటీఆర్ భవిష్యత్తులో ఇంకా సేవలు చేయాలి: చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీ హీరో, రాజకీయవేత్త చిరంజీవి ఇవాళ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపి ప్రశంసల జల్లు కురిపించారు. డియర్ తారక్ అంటూ కేటీఆర్ కు విషెస్ తెలిపారు.

కేటీఆర్ భవిష్యత్తులోనూ ఇంకా సేవలు చేయాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే నేత కేటీఆర్ అని అన్నారు. ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకొని సాయం చేస్తారని తెలిపారు.

30 వేలు దాటిన కరోనా మృతులు

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా భారత్ లో కరోనా విజృంభిస్తోంది. దేశంలో లాక్ డౌన్ కు సడలింపులు ఇచ్చిన తర్వాత కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. నేటికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 12,38,636 కి చేరింది.

వైరస్ బారిన పడి ఇప్పటివరకు కరోనాతో 30,601 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం భారత్ లో యాక్టీవ్ కేసుల సంఖ్య 4,26,167 కి చేరింది. కరోనా నుంచి కోలుకొని ఇప్పటి వరకు 7,82,606 మంది ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయినారు.