- అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలతో క్రికెట్ పిచ్ లు
- జిల్లా క్రికెట్ చరిత్రలో నూతన క్రికెట్ అకాడమీ
- కొడిమి జర్నలిస్ట్ కాలనీలో 16 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ
👉ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా క్రికెట్ చరిత్రలో మరో నూతన అధ్యాయానికి నాంది పలకనుంది.
👉జిల్లా క్రికెట్ చరిత్రలో 365 రోజులు క్రికెట్ శిక్షణ శిబిరాన్ని క్రికెట్ అకాడమీ కొడిమి జర్నలిస్ట్ కాలనీలో ఏర్పాటు చేస్తున్నామని మచ్చా రామలింగారెడ్డి చైర్మన్ ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రకటించారు.
👉ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం అనంతరం ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లను ఎంపిక చేసుకుని ప్రతి రోజూ శిక్షణ ఉంటుందని మ్యాచ్లు నిర్వహించి టోర్నమెంట్లు నిర్వహించి ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ యువ క్రికెటర్లను ప్రోత్సహిస్తుందని మచ్చా తెలిపారు.
👉అనంతపురం జిల్లాలో ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లను ప్రోత్సహించడానికి వారి ప్రతిభను వెలుగులోకి తేవడానికి తన చిరకాల వాంఛ ఒక క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మచ్చా తెలిపారు.
👉అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలతో కొడిమి జర్నలిస్ట్ కాలనీలో క్రికెట్ పిచ్ లను ఏర్పాటు చేశామని జిల్లాలోని యువ క్రికెట్ క్రీడాకారులు అందరూ ఈ అకాడమీని ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని మచ్చా రామలింగారెడ్డి కోరారు.
👉రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా జర్నలిస్ట్ కాలనీలో ఈనెల 16వ తారీకు నుంచి ఉచితంగా క్రికెట్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు.
👉జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టు పిల్లలు క్రికెట్ ఆడాలని ఆసక్తి ఉన్నా ప్రతి ఒక్కరూ ఈ శిక్షణలో పాల్గొన్న వచ్చునని మచ్చా రామలింగారెడ్డి తెలిపారు.
👉ఒక నెల రోజుల పాటు ఉచితంగా క్రికెట్ శిక్షణ శిబిరం ఉంటుందని సీనియర్ క్రికెట్ క్రీడాకారులు కోచ్ లను ఏర్పాటు చేశామని ఉదయము సాయంత్రము శిక్షణ ఉంటుందని మచ్చా వివరించారు.
ANDHRA PRADESH SPORTS DEVELOPMENT TRUST (A.P.S.D.T)