వ్యాక్సిన్… ఈయు కు ఇండియా హెచ్చరిక
న్యూఢిల్లీ: కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను యురోపియన్ యూనియన్ (ఈయు) గుర్తించనట్లయితే ఆ దేశాలనుంచి వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్ అమలు చేస్తామని ఇండియా హెచ్చరించింది.
ఈ రెండు వ్యాక్సిన్లను గుర్తించకపోవడం మూలంగా ఉద్యోగాలు,, చికిత్స, అధ్యయనాల కోసం యూరప్ దేశాలకు వెళ్తున్న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంలో ఇండియా చాలాసార్లు, అయినా ఈయు మొండి వైఖరి అవలంభిస్తున్నది. డిజిటల్ సర్టిఫికెట్లను కూడా అంగీకరించడం లేదు. ఇదే వైఖరి కొనసాగితే యూరప్ నుంచి వచ్చే వారికి 14 రోజుల క్వారంటైన్ అమలు పరుస్తామని ఘాటుగా సందేశం పంపించింది. లేదా డిజిటల్ సర్టిఫికెట్లను నోటిఫై చేయాలని ఈయుకు ఇండియా స్పష్టం చేసింది.