హైదరాబాద్: నాంపల్లి గాంధీ భవన్ లో మల్కాజిగిరి ఎంపి ఏ.రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్య నేతలు హాజరయ్యారు.
పూర్వ అధ్యక్షుడు, ఎంపి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి రేవంత్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకార కార్యక్రమం ముగియగానే ఇందిరా భవన్ లో జరిగే బహిరంగ సభకు బయలుదేరారు. అంతకు ముందు జుబ్లిహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. అధ్యక్ష బాధ్యతల స్వీకార కార్యక్రమంలో మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, మల్లు భట్టి విక్రమార్క, మల్లు రవి, మధు యాష్కి గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్కం ఠాగూర్ పాల్గొన్నారు.