ఏలూరులో దూదేకుల మహిళకు మేయర్ పదవి ఇవ్వబోతున్నాం..సజ్జల రామకృష్ణ రెడ్డి

తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యలయంలో నూర్ భాష కార్పొరేషన్ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి, బిసి సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, నవరత్నాలు అమలు కమిటీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి. ఈ కార్యక్రమంలో నూర్ బాషా కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, సంఘం నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి

రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికలలోనైన ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి ఒక్కటే కారణం చెప్పిన ప్రతి హామీ అమలు చేయటమే. ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రజలను ఓట్ల కోసం మభ్యపెట్టే సీఎం కాదు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అధికారం చేపట్టిన మొదటి రోజు నుండి అమలు చేసుకుంటూ పోతున్నారు సీఎం. వైసిపి పార్టీ ఎవరినీ కుల సంఘం నాయకులుగా చూడదు. అందరినీ పార్టీ నాయకులుగా చూస్తుంది.వెనుకబడిన వర్గాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని సామాజికంగా, రాజకీయంగా ఎదగాలి. వెనుకబడిన వర్గాలలోని మహిళ అభ్యున్నతికి సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారు. మహిళ సాధికారత దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. మహిళలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న భరోసాతో. మహిళలు కూడా రాజకీయ సాధికారిత దిశగా ఎదగాలి.

బిసి సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

సీఎంకు మొదటి ప్రాధాన్యత వెనుకబడిన వర్గాల అభివృద్ధి. సామజికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాల ఎదుగుదల సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి. వెనుకబడిన వర్గాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ,సామాజిక ప్రాధాన్యత కల్పించారు. నవరత్నాలు పేరుతో సంక్షేమ పథకాలను అందించి…పేదల అభ్యున్నతికి కృషిచేస్తున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన నన్ను ఎమ్మెల్యేగా,మంత్రిగా చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిది. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసే మహాయజ్ఞంలో నన్ను సీఎం కీలకపాత్రదారుడిని చేసారు. పేదలకోసం అందించే విద్య,వైద్య విధానంలో కార్పొరేట్ స్థాయి కన్న గొప్పగా ఉండేలా వినూత్న పథకాలు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ కార్పొరేషన్ ద్వారా మీ యొక్క జాతిని అభివృద్ధి చేసుకోవాలని అకాంక్షిస్తున్నాను.

ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

బిసిలు,మైనారిటీల అభివృద్ధి ఈ ప్రభుత్వం లక్ష్యం. భవిష్యత్తులో వెనుకబడిన వర్గాలలోని ప్రతి ఒక్కరు రాజకీయంగా ఎదగాలి.వెనుకబడిన వర్గాల ఎదుగుదల కోసమే ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కుల సంఘ నాయకులుగా కాదు. రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దుతాం. రాష్ట్రంలో మీకు ఏ సమస్యలు ఉన్న రాష్ట్ర కార్యలయం దృష్టికి తీసుకొనిరాండి. వెనుకబడిన వర్గాల భవిష్యత్తు తరాల గురించి ఆలోచించే పార్టీ వైసిపి పార్టీ మాత్రమే.

Leave A Reply

Your email address will not be published.