జర్నలిస్టులకు అండగా ఉంటా

కొడిమి జర్నలిస్ట్ కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తాం.. జిల్లా కలెక్టర్ కుమారి నాగలక్ష్మి సెల్వరాజన్

కలెక్టర్ ని కలిసిన మచ్చా రామలింగారెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు (A.P.W.J.U)
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్.

👉జర్నలిస్టుల న్యాయమైన సమస్యలు పరిష్కారానికి కృషిచేస్తానని జర్నలిస్టులకు ఎటువంటి సమస్య వచ్చినా అండగా ఉంటానని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ కుమారి నాగలక్ష్మి సెల్వరాజన్ అన్నారు.

👉కొడిమి జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధికి మౌలిక వసతులు కల్పిస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ కుమారి నాగలక్ష్మి సెల్వరాజన్ అన్నారు.

👉జిల్లా అభివృద్ధికి జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు మీ అందరి సహకారంతో ముందుకు వెళ్తామని జిల్లా యంత్రాంగానికి అందరూ సహకరించాలని నాగలక్ష్మి సెల్వరాజన్ అన్నారు.

👉 ఈ రోజు అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం నందు మచ్చా రామలింగారెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు APWJU ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్ గారిని కలిసి వివిధ సమస్యలు వివరించారు.

👉జిల్లాలో గతంలో మాదిరిగా వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ లు ఇవ్వాలని జర్నలిస్టుల సమస్యలపై దృష్టి పెట్టి ఆదుకోవాలని మచ్చా రామలింగారెడ్డి కలెక్టర్ ని కోరారు.

👉జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కి మచ్చా రామలింగారెడ్డి మొక్కను అందజేశారు.

👉ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సభ్యులు విజయరాజు భాస్కర్ రెడ్డి, బాలు జానీ, షాకీర్, ఉపేంద్ర, చలపతి, హనుమంత్ రెడ్డి, శ్రీకాంత్ పెద్ద ఎత్తున జర్నలిస్టులు కలెక్టర్ గారిని కలిశారు.

💎ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (A.P.W.J.U)
అనంతపురం జిల్లా శాఖ💎

Leave A Reply

Your email address will not be published.