ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలి.జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి విస్తరణ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలి.జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్

అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి విస్తరణ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రక్రియను ఆగస్టు 5వతేదీ నాటికి త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. శనివారం అనంతపురం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి విస్తరణ నేపథ్యంలో పలు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)ఏ.సిరి తదితరులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి విస్తరణ నేపథ్యంలో నగరంలోని ఆర్అండ్ బి, ఇరిగేషన్ కార్యాలయాల పరిధిలోని స్థలాన్ని కేటాయించడంతో అక్కడున్న ఆయా ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలిక భవనాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఆర్ అండ్ బి, ఇరిగేషన్ తదితర కార్యాలయాలను తాత్కాలికంగా తరలించేందుకు కోసం నగరంలోని ఆర్కియాలజీ శాఖకు చెందిన భవనాలు, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కు చెందిన భవనాలను, ట్రైబల్ కమ్యూనిటీ (గిరిజన) భవన్ లను పరిశీలన చేయాలన్నారు. వచ్చే నెల ఆగస్టు 5వ తేదీలోపు ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలిక భవనాలలోకి తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల తరలింపు కోసం ఎంపిక చేసిన భవనాలలో అవసరమైన మరమ్మతు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణం జరిగే వరకు వాటిని తాత్కాలిక భవనాలలో కొనసాగించేలా అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో ఆర్డీఓ మధుసూదన్, నగర పాలక సంస్థ కమిషనర్ పివీవీఎస్ మూర్తి, గ్రౌండ్ వాటర్ డిడి తిప్పేస్వామి, హెచ్ఎల్సి ఎస్ఈ రాజశేఖర్, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్, ఆర్కియాలజీ శాఖ ఏడి రజిత, కలెక్టరేట్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్ హరికుమార్, తహసిల్దార్ లక్ష్మీ నారాయణ రెడ్డి, ఆర్ అండ్బి ఎస్ఈ, ఎమ్ఎస్ఐడిసి ఈఈ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.