ముస్లిం సోదరులకు అనంతపురము జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ I.A.S గారు, బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈద్-ఉల్-అజా (బక్రీద్) సందర్భంగా ఆనంతపురము జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ I.A.S గారు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. బక్రీద్ త్యాగానికి, నమ్మకానికి, భక్తి భావానికి ప్రతీకలని కలెక్టర్ తన సందేశంలో పేర్కొన్నారు. బక్రీద్ పండుగ సమాజంలో ప్రజల మధ్య దయ, సామరస్యాలను పెంపొందిస్తుందని ఆమె తెలిపారు. ఈ పండుగ త్యాగానికి ప్రతీక అని కొనియాడారు.

ఈ పండుగను ముస్లిం సోదరులందరూ ఉత్సాహంగా జరుపుకోవాలని… అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులు అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలు జరుపుకోవాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.