ముస్లిం సోదరులకు అనంతపురము జిల్లా SP డాక్టర్. ఫక్కీరప్ప గారు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈద్-ఉల్-అజా (బక్రీద్) సందర్భంగా ఆనంతపురము జిల్లా SP డాక్టర్.  ఫక్కీరప్ప గారు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జిల్లా SP మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. బక్రీద్ త్యాగానికి, నమ్మకానికి, భక్తి భావానికి ప్రతీకలని జిల్లా SP తన సందేశంలో పేర్కొన్నారు.

బక్రీద్ పండుగ సమాజంలో ప్రజల మధ్య దయ, సామరస్యాలను పెంపొందిస్తుందని ఆయన తెలిపారు. ఈ పండుగ త్యాగానికి ప్రతీక అని కొనియాడారు. ఈ పండుగను ముస్లిం సోదరులందరూ ఉత్సాహంగా జరుపుకోవాలని… అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులు అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలు జరుపుకోవాలని సూచించారు.

 

Leave A Reply

Your email address will not be published.