శని, ఆదివారాల్లో కేరళలో లాక్‌డౌన్‌.

★ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం 19,15,501 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 38,792 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

★ క్రితంరోజు కంటే 23 శాతం పెరుగుదల కనిపించింది.

★ దాంతో మొత్తం కేసులు 3.09కోట్లకు చేరాయి.

★ నిన్న మరో 624 మంది మహమ్మారికి బలయ్యారు.

★ ఇప్పటివరకు 4,11,408 మంది ప్రాణాలు కోల్పోయినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

★ ప్రస్తుతం 4,29,946 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు.

★ క్రియాశీల రేటు 1.39 శాతానికి తగ్గింది.

★ నిన్న 41వేల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3,01,04,720(97.28 శాతం)కి చేరాయి.

★ ఇక నిన్న 37.14 లక్షల మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసులు 38.76 కోట్లకు చేరాయి.

కేరళలో రెండు రోజుల లాక్‌డౌన్‌..

★ దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కొత్త కేసుల్లో కేరళ, మహారాష్ట్రదే సగానికి పైగా వాటా ఉంది.

★ ఈ ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు కేరళ ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ వైపు మొగ్గుచూపింది.

★ జులై 17, 18న పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

★ ప్రస్తుతం కేరళలో 14వేలకు పైగా కేసులు వెలుగుచూడగా.. మహారాష్ట్రలో ఆ సంఖ్య ఏడువేలకు పైనే ఉంది.

Leave A Reply

Your email address will not be published.